మహిళలే సనాతన ధర్మ పరిరక్షకులని విశ్వహిందూ పరిషత్ మాతృ శక్తి తెలంగాణ ప్రాంత సహ సంయోజిక సద్ది శ్రీవాణి తెలిపారు. గురువారం సూర్యాపేటలోని శ్రీ విజయ ఆంజనేయ స్వామి దేవాలయంలో దుర్గామాత ఉత్సవ సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో సత్సంగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలే సనాతన ధర్మ పరిరక్షకులని, తల్లులు తమ పిల్లలకు జీజియా మాతలాగా చదువుతో పాటు సంస్కారాలు నేర్పాలన్నారు.