లంబాడి విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ శివ నాయక్, సూర్యాపేటలో మాట్లాడుతూ, బంజారా సమాజానికి శీతల భవాని పండుగ అత్యంత పవిత్రమైనదని తెలిపారు. ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం దేశవ్యాప్తంగా బంజారా సమాజం ఈ పండుగను నిర్వహిస్తుందని, ఇది ప్రకృతి, పశుసంపద, సామాజిక ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా గుర్తించి, ప్రభుత్వ సెలవు ప్రకటించి, ప్రత్యేక నిధులు కేటాయించాలని, అలాగే బంజారా తండాల్లోని దేవాలయాల అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ, పాఠ్యపుస్తకాలలో పండుగ విశిష్టతను చేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.