అధ్వానంగా చీదేళ్ల నుండి చెట్ల ముకుందాపురం వెళ్లే రహదారి

905చూసినవారు
పెన్‌పహాడ్ మండలం చీదేళ్ల నుంచి చెట్ల ముకుందాపురం వెళ్లే ప్రధాన రహదారి భారీ వర్షాలకు కొట్టుకుపోయి గుంతలమయంగా మారింది. రోడ్డు మొత్తం బురదమయంగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, రైతులు నిత్యం అవస్థలు పడుతున్నారని, అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు వెంటనే స్పందించి తాత్కాలికంగా మోరం పోసి రాకపోకలు సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే నిరసన చేపడతామని బీఎంఎస్ జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్