ఓటర్ల జాబితాలో తమ వివరాలను తనిఖీ చేసుకోవాలి

1107చూసినవారు
ఓటర్ల జాబితాలో తమ వివరాలను తనిఖీ చేసుకోవాలి
సమగ్ర ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళ వారం సూర్యాపేట పట్టణంలోని 25వ వార్డులో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన వారు, 18 ఏళ్లు నిండిన యువత ఓటు నమోదు చేసుకోవడంతో పాటు ఓటర్ల జాబితాలో తమ వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తున్నందున ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్