దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్

4చూసినవారు
దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్
బైకు దొంగతనాలకు పాల్పడుతున్న సూర్యాపేట జిల్లాకు చెందిన చెవుల మనోజ, గొర్ల శివారెడ్డి, ఆరే విజయ్, వీరబోయిన భరత్ నలుగురు వ్యక్తులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి, మద్యం జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితులపై పలు మర్డర్ కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుండి ఒక కారు, రెండు బైకులు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ భరత్ మరియు కానిస్టేబుళ్లను ఎసిపి పండరి చేతన్ నితిన్ అభినందించారు.

సంబంధిత పోస్ట్