ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు సూర్యాపేట సేవా, ఆధ్యాత్మిక మిత్రమండలి ఆధ్వర్యంలో చాగంటి కోటేశ్వరరావు ‘దేవ మహత్యం’ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు బొమ్మిడి అశోక్ తెలిపారు. శనివారం రవి మహల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 1న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు సాయిబాబా ఆలయం సమీపంలోని రవి మహల్లో ప్రవచనం ఉంటుందని తెలిపారు. భక్తులు సమయపాలన పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. హాల్లో స్థలం సరిపోని వారి కోసం బయట పెద్ద తెరలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.