టీవీఏసీ జేఏసీ నిరవధిక సమ్మె గోడ పోస్టర్ ను సూర్యాపేట జిల్లా చైర్మన్ మేడే మారయ్య ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ యూనియన్లకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికుడు యూనియన్లకు అతీతంగా జూలై 14 వ తేదీ నుండి సమ్మెలో పాల్గొనాలని కోరారు. అలాగే ఒకే సంస్థలో రెండు రూల్స్ తీసుకురావడం అన్యాయమని విమర్శించారు. స్టాండింగ్ ఆర్డర్స్ ను రద్దుచేసి ఏపీ ఎస్ ఈబీ రూల్స్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.