తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు

1చూసినవారు
తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు
సూర్యాపేటలో వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. బాలాజీ గ్రాండ్ బ్యాంకెట్ హాల్‌లో మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ అధికారులతో జరిగిన సమావేశంలో ముందస్తు ప్రణాళికపై చర్చించారు. నీటి సమస్యలు తలెత్తే వార్డులను గుర్తించి, క్రమం తప్పకుండా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, గతంలో ఇబ్బందులు ఎదురైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేగవంతం చేసి, తవ్విన గోతులను వెంటనే పూడ్చి రహదారులను సరిచేయాలని ఆదేశించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ పెంచాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you