ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, టెట్ రద్దు డిమాండ్ తో ఫిబ్రవరి 5న ఢిల్లీలో జరిగే ధర్నాకు సూర్యాపేట జిల్లా నుండి ఉపాధ్యాయ బృందం తరలి వెళ్లింది. వెళుతున్న బృందానికి టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో యుటిఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మండలాల బాధ్యులు పాల్గొన్నారు.