కాలేజీ విద్యార్థుల అక్రమ అరెస్టుపై విహెచ్ పీఎస్ ఖండన

2చూసినవారు
కాలేజీ విద్యార్థుల అక్రమ అరెస్టుపై విహెచ్ పీఎస్ ఖండన
ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ విద్యార్థుల అక్రమ అరెస్టుపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం, నూతన హాస్టల్ కేటాయించాలని శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల చర్యలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా అర్ధరాత్రి లా కాలేజ్ ప్రిన్సిపల్ రాంప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉస్మానియా లా విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రాజేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మారవేణి చంద్రశేఖర్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్