జలశక్తి పథకం కింద ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, 20 రకాల నీటి సంరక్షణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నర్సరీలు, ఇంకుడు గుంతల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించవద్దని, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని సూచించారు.