చంచల్ గూడ జైలులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. 'కోర్టే స్వయంగా మొట్టికాయలు వేసి ఆ సెక్షన్లు తీసేయాలని చెప్పింది. గతంలో
కాంగ్రెస్ నేతలు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. లేనిది సృష్టించి బాల్క సుమన్ మీద అక్రమ కేసులు పెట్టారు. జైళ్లు, కేసులు మాకు కొత్త కాదు. ఈ అణిచివేతను ఎదుర్కొని తప్పకుండా అధికారంలోకి వస్తాం' అని అన్నారు.