బీజేపీ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గుణగంటి పృథ్వి అన్నారు. నల్లగొండలో
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై,
బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడులను నిరసిస్తూ మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని, అందుకు ప్రతీకారంగా దాడులకు పాల్పడటం సరికాదన్నారు. దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.