విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా పని చేయాలి

0చూసినవారు
విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా పని చేయాలి
పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామపంచాయతీలో సర్పంచ్ ఇటికల శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచే లక్ష్యంతో ఈ సభ నిర్వహించారు. గ్రామంలోని బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, కిట్లు, క్రీడా సామగ్రి వంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోరారు. అనంతరం బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్