గాంధీజీ ఆశయాల సాధనకు కృషి చేయడమే ఘన నివాళి: కొప్పుల వేణారెడ్డి

0చూసినవారు
గాంధీజీ ఆశయాల సాధనకు కృషి చేయడమే ఘన నివాళి: కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అహింసనే ఆయుధంగా చేసుకొని భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మా గాంధీ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే గాంధీజీకి అందించే ఘనమైన నివాళి అని ఆయన అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ అహింసా మార్గంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి దేశ ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు.

సంబంధిత పోస్ట్