సమస్యలపై వినతులు అందజేయడం ప్రజల వంతు, వాటి పరిష్కారం తనవంతు అని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట లోని 29వ వార్డు తాళ్లగడ్డ ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల వెనుక ఉన్న వివాదాస్పద భూమిని ప్రజల విన్నపం మేరకు ఆయన పరిశీలించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, అధికారులతో కలిసి స్థలాన్ని సందర్శించి, స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమస్యపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల మధ్యే సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు. తమ సమస్యను పరిష్కరించేందుకు స్పందించినందుకు బాధితులు సర్వోత్తమ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.