దేశ రక్షణ కోసం భారత సైన్యంలో చేరేందుకు యువత ముందుకు రావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 2027 రిక్రూట్మెంట్ కోసం ఏప్రిల్ 1వ తేదీ నుండి అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 17 1/2 నుండి 22 సంవత్సరాల లోపు వయసు ఉండి, పదవ తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపిక రాత పరీక్ష, శారీరక దారుఢ్యం, మెడికల్ ఫిట్నెస్ ద్వారా జరుగుతుందని పేర్కొన్నారు.