ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా
కాంగ్రెస్ పార్టీ నాయకులు, SS సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఖమ్మం క్రాస్ రోడ్‌లో బుధవారం ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొని, వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు.