
ఒక్క ఓటుతో గెలిచిన తూర్పు తండా సర్పంచ్ భూక్యా వీరన్న
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం తూర్పు తండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య వీరన్న సర్పంచ్‌గా గెలుపొందారు. ఆయన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి భూక్య వెంకన్నపై కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. గతంలో కూడా ప్రజలు తనను సర్పంచ్‌గా గెలిపించారని, ఈసారి కూడా గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని, రోడ్లు, మురికి కాలువలు నిర్మిస్తానని భూక్య వీరన్న తెలిపారు.






































