భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ. 12వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు ఆరోపించారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.