సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నిమ్మికల్లు వద్ద శ్రీ దండు మైసమ్మ తల్లి ఆలయం సమీపంలో సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రహదారి భారీ వర్షాల కారణంగా తెగిపోయింది. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డును పునర్నిర్మించాలని వారు కోరుతున్నారు.