గానుగబండ వి. బి. కె పై చర్యలు తీసుకోవాలని ఏపిఎంకు ఫిర్యాదు

0చూసినవారు
గానుగబండ వి. బి. కె పై చర్యలు తీసుకోవాలని ఏపిఎంకు ఫిర్యాదు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామంలో స్త్రీనిధి ద్వారా రుణాలు పొందిన మహిళలు, తమ వాయిదా సొమ్మును బ్యాంకులో చెల్లించకుండా వీబీకే సొంతానికి వాడుకున్నారని ఆరోపిస్తూ ఏపీఎం యాదమ్మకు ఫిర్యాదు చేశారు. రుణం తీసుకున్న మహిళలు నెలనెలా అసలు, వడ్డీ కలిపి చెల్లించిన సొమ్మును వీబీకే కొన్ని నెలలు మాత్రమే బ్యాంకులో జమ చేసి, మిగతాది దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్