శాలిగౌరారం మండల కేంద్రంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో
కాంగ్రెస్ నాయకుడు నిమ్మల శంకర్ మాతృమూర్తి, మూడో వార్డు సభ్యురాలు దివంగత నిమ్మల సుశీల దశదిన కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత ధనుంజయ్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ భూపతి అంజయ్య, సర్పంచ్ గుజిలాల్ శేఖర్ బాబు, ఉప సర్పంచ్ తాటిపాముల పాపారావు, జిల్లా
కాంగ్రెస్ నాయకుడు పెరుమాండ్ల నరేష్, వడ్లకొండ పరమేష్, బొల్లికొండ గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.