కొత్తగూడెంలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

1చూసినవారు
కొత్తగూడెంలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామం శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కొత్తగూడెం గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని BC కాలనీ, తాటి చెట్ల బజారు (శ్రీకృష్ణ కాలనీ)లోని వినాయక మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీకృష్ణ యూత్ సభ్యులు మాట్లాడుతూ, భక్తి, సేవా భావంతో ప్రతి సంవత్సరం వివిధ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్నదానం చేయడం ద్వారా భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్