జాజిరెడ్డిగూడెం: బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఆర్డీవో

1చూసినవారు
జాజిరెడ్డిగూడెం: బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఆర్డీవో
సూర్యాపేట జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా, గురువారం మండల కేంద్రంలోని యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో సూర్యాపేట ఆర్డిఓ వేణు మాధవరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన లక్ష్మీనరసింహస్వామి, అష్టలక్ష్మి చెంచులక్ష్మికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ భాషాపాక శ్రీకాంత్, రెవెన్యూ అధికారులు, దేవస్థాన చైర్మన్ అని రెడ్డి రాజేందర్ రెడ్డి, సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బైరబోయిన సైదులు ముదిరాజ్, దేవస్థాన డైరెక్టర్లు, అర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :