గురువారం సిపిఎం జాజిరెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో అర్వపల్లి, రామన్నగూడెం, తిమ్మాపురం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం, మండల కార్యదర్శి వజ్జ శ్రీనివాస్ మాట్లాడుతూ, అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత 25 రోజులుగా ఐకెపి కేంద్రాలలో ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.