సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఓబీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తండు శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం యాదవులకు పెద్ద పీట వేస్తుందని, ఈ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తారని, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటి సైజులు, బెంజారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.