సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం అర్వపల్లిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కల్వకుంట్ల కవిత సందర్శించారు. నేడు సావిత్రి బాయ్ పూలే జయంతి వేడుకల్లో పాల్గొని, విద్యార్థినులతో మాట్లాడారు. వారికి చాక్లెట్లు పంపిణీ చేసి, చదువులో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాళ్లు కూడా పాల్గొన్నారు.