పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మొదటి స్థానం సాధించిన లిఖిత

5చూసినవారు
పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మొదటి స్థానం సాధించిన లిఖిత
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామానికి చెందిన వెలుగు లిఖిత పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మండలంలో ప్రథమ స్థానం సాధించారు. ఆర్ పి ఆర్ పి పాఠశాలలో చదువుతున్న లిఖిత 600 మార్కులకు గాను 569 మార్కులు సాధించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన లిఖిత ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించానని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్