చిరు వ్యాపారులకు లయన్స్ క్లబ్ చేయూత.. గొడుగుల పంపిణీ

0చూసినవారు
చిరు వ్యాపారులకు లయన్స్ క్లబ్ చేయూత.. గొడుగుల పంపిణీ
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో చిరు వ్యాపారులకు లైన్స్ క్లబ్ చేయూత అందించింది. కుటుంబ పోషణ కోసం పండ్లు అమ్ముకునే సాధు లక్ష్మీకి, ఆమె భర్త పుల్లయ్యకు లయన్స్ క్లబ్ తుంగతుర్తి ఆధ్వర్యంలో ఎండ వేడి నుండి రక్షణ కొరకు గొడుగు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు పాలవరపు సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జి. ఎం. టి కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి, కోశాధికారి గుండ గాని రాము, కోఆర్డినేటర్ ఓరుగంటి శ్రీనివాస్, ఓరుగంటి సుభాష్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్