మద్దిరాల: నేలరాలిన మామిడి కాయలు.. రైతు ఆవేదన

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన మామిడి రైతు గిరి కౌలుకు పట్టిన తోటలో గాలి దుమారం బీభత్సంతో మామిడికాయలు నేలరాలాయి. మామిడికాయలు నేల రాలడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి మామిడి తోటలు పట్టామని, మామిడి తోటలు నష్టం వాటిల్లడంతో ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు స్పందించి నష్ట పరిహారం అందించాలని కోరుకుంటున్నారు.
