యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో ఒక రైతు పొలంలో ట్రాన్స్ ఫార్మర్ పాడైంది. గ్రామానికి చెందిన హెల్పర్ ఓర్సు సురేష్ విద్యుత్ లైన్ ను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. ప్రమాదానికి గురైన సురేష్ కు సీపీఆర్ చేసి, భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.