వంద రోజుల కార్యాచరణ ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా మోత్కూరు కమిషనర్ ఆదేశానుసారం మోత్కూరు పురపాలక సంఘ పరిధిలోని 1వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త వేరు వేరు చేసి సేకరించుటకు పురః సిబ్బందికి, పట్టణ ప్రజలకు మెప్మా సిబ్బంది ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.