యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధి బుజిలాపురంకి చెందిన చింతల ఉపేందర్ రెడ్డిని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జాతీయ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కె. సి వేణుగోపాల్ నియామకపు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డిని పలువురు అభినందించారు. తనపై నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం అప్పగించిన పదవికి న్యాయం చేసి, నిరంతరం పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తానన్నారు.