మోత్కూరు: లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

1చూసినవారు
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీడీవో కార్యాలయంలో మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన 30 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పేదలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు ఒక వరం లాంటివని ఆయన అన్నారు.