రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ అయోధ్య రెడ్డి బుధవారం మోత్కూర్ కు విచ్చేశారు. స్థానిక టీయూడబ్ల్యూజే శాఖ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికి, శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అయోధ్య రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ జర్నలిస్టులు ఎస్ఎన్ చారి, బుర్ర శ్రీను, అనిల్, హరి ప్రసాద్ పాల్గొన్నారు.