యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోనీ కె. ఆర్ భవన్ లో ప్రజా సంఘాల ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వo అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.