మోత్కూరు: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సామేలు

4చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం 12 వార్డులలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే స్థానిక సమస్యలు పరిష్కారమవుతాయని, రేవంత్ రెడ్డి పాలనలో ఆరు గ్యారెంటీలు నెరవేరుతున్నాయని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా తనను ఆదరించినట్లే, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :