మోత్కూర్: అమరవీరుల కుటుంబాలను గౌరవించుకోవడం గర్వంగా ఉంది

1చూసినవారు
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను గౌరవించుకోవడం గర్వంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత ల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల ససామేల్ తో కలిసి వారిని ఘనంగా సన్మానించారు. సన్మాన సభలో కళాకారులు అమరవీరుల కుటుంబం పాటలు ఆలపిస్తున్నప్పుడు కాసోజు శంకరమ్మ భావోద్వేగానికి గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్