యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో పలు పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేలు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్, సిపియం పార్టీల నుంచి కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరడం సంతోషదాయకమని, రేవంత్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందని అన్నారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.