బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకు అనుకుంలంగా మతోన్మాద చర్యలకు పాల్పడుతుందని ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చెయ్యాలని చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సు పిలుపునిచ్చారు. శనివారం మోత్కూర్ లో ప్రజా సంఘాల నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభాకర్, చంద్రయ్య, పాల్గొన్నారు.