సూర్యాపేట జిల్లా నాగారం(బంగ్లా)లో సూర్యాపేట-జనగామ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గుండు మల్లేశ్ (26) అనే యువకుడు మృతి చెందాడు. వర్ధమానుకోట గ్రామానికి చెందిన మల్లేశ్, నాగారంలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. తిరుమలగిరి నుంచి సొంతూరు వస్తుండగా, నాగారం సమీపంలో రోడ్డుపై నిలిపిన వాహనాన్ని చీకటిలో గమనించక వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రమాదకరంగా రహదారి పక్కన ఏర్పాటు చేసిన తారు మిక్సింగ్ కేంద్రాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.