నాగారం మండలవ్యాప్తంగా అన్ని గ్రామాలలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి నాగారం, మామిడిపల్లి గ్రామాల్లో జెండా ఆవిష్కరణ చేసి, కార్మికుల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. 1886లో చికాగోలో 8 గంటల పని దినం కోసం కార్మికులు చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గు డిపూడి వెంకటేశ్వర్, కడెం కుమార్ పాల్గొన్నారు.