నాగారం: ప్రజల భద్రత కోసం నిఘా నేత్రాలు ఏర్పాటు: ఎస్ఐ

0చూసినవారు
నాగారం: ప్రజల భద్రత కోసం నిఘా నేత్రాలు ఏర్పాటు: ఎస్ఐ
సూర్యాపేట జిల్లా నాగారం ఎస్.ఐ చిరంజీవి సోమవారం ఫణిగిరి క్రాస్ రోడ్డు వద్ద ప్రజల భద్రత కోసం నిఘా నేత్రాలను ప్రారంభించారు. ఈటూర్, ఫణిగిరి గ్రామాల సర్పంచుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ నిఘా నేత్రాలు అసాంఘిక కార్యకలాపాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. ఒక్క నిఘా నేత్రం వందమంది పోలీసులతో సమానమని, ప్రజల భద్రత, రవాణా భద్రత దృష్ట్యా వీటి ఏర్పాటు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు కూడా సమాజంలో అసాంఘిక కార్యకలాపాల నివారణకు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్