నాగారం: పార్టీ క్రమశిక్షణ తప్పిన వారిపై వేటు

68చూసినవారు
నాగారం: పార్టీ క్రమశిక్షణ తప్పిన వారిపై వేటు
సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ, నాయకులు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీపై నాయకులపై అనుచిత వ్యాఖ్యలతో దాడులకు పాల్పడి క్రమశిక్షణ ఉల్లంఘించిన జేరిపోతుల సంపత్ ని పార్టీ ఆదేశానుసారంగా మండల అధ్యక్షులు తోడుసు లింగయ్య యాదవ్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇప్పటి నుండి అతనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవన్నారు.