నూతనకల్: ఐకెపి సెంటర్లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం

సూర్యాపేట జిల్లా నూతనకల్ ఐకెపి సెంటర్ లో గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, నో డ్రగ్స్ సేవ్ లైఫ్ అంటూ కరపత్రాలు పంచుతూ, ఫ్లెక్సీలతో విచిత్ర వేషధారణలో ప్రచారం నిర్వహించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో ఉండాలని పిలుపునిచ్చారు.
