సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిలపకుంట్ల గ్రామంలో శనివారం అకాల వర్షానికి నేలమట్టమైన వరి పొలాలను ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో పరిశీలించారు. రైతులు కష్టపడి పండించిన పంట తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారని, వారికి ఎకరానికి రూ. 40 వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.