సూర్యాపేట నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొప్పుల వేణారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనకల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కోడి కుమార్ యాదవ్, గోడిశాల అంజి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.