సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ లో 9వ తరగతి విద్యార్థులకు పోలీస్ మరియు చట్టాలపై అవగాహన కల్పించారు. సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, సమస్యలపై పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు పిటిషన్ ఎలా ఇవ్వాలి, ఎఫ్ఐఆర్, ఎంక్వయిరీ, కోర్టుకు సరెండర్ వంటి విషయాలపై వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, మాదకద్రవ్యాల అనర్థాలు, ఫోక్సో చట్టం, సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమింగ్ లపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.