స్వీయ గణన చేసుకునేందుకు 5 రోజులు మాత్రమేగడువు

0చూసినవారు
స్వీయ గణన చేసుకునేందుకు 5 రోజులు మాత్రమేగడువు
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ, స్వీయ గణన చేసుకునేందుకు ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే గడువు ఉందని, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, మహిళా సంఘాలు, ఐటీ నిపుణులు, అన్ని వర్గాల వారు స్వీయ గణనలో పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. జనగణనకు సంబంధించి స్వీయ గణన మే 10 వరకు అవకాశం ఉందని, మొదటి దశలో భాగంగా గృహ లెక్కింపు మరియు గృహ పరిస్థితుల లెక్కింపు కోసం నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తమ వివరాలను నమోదు చేసుకోని వారు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.